NTV Telugu Site icon

TSPSC Paper Leakage: పేపర్‌ లీకేజీపై నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్

Governor Tamilisai

Governor Tamilisai

తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రచ్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోంది. ఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ స్పందించారు. పేపర్‌ లీకేజీ నివేదికను పంపాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సీఎస్‌, టీఎస్‌పీఎస్సీ, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. సిట్ దర్యాప్తు స్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు. టీఎస్పీఎస్సీ కమిషనర్ అనుమతి లేకుండా ఎంత మంది పరీక్షలకు హాజరయ్యారని వివరాలు కోరారు. పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్సీ సిబ్బంది వివరాలు ఇవ్వాలని గవర్నర్ తమిళి ఆదేశించారు.
Also Read:Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్

మరోవైపు పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తును సిట్‌ ముమ్మరం చేసింది. ఈ కేసులో గ్రూప్‌-1 పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను సిట్‌ ఆరా తీసింది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను సిట్‌ అధికారులు తెలుసుకున్నారు. అయితే టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని ఉద్యోగుల్లో మరో ఇద్దరికీ గ్రూప్‌-1లో భారీ మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్‌-1లో షమీమ్‌కు 127 మార్కులు రాగా రమేశ్‌కు 122 మార్కులు వచ్చాయని గుర్తించారు. ఈ క్రమంలో మరో ముగ్గురు ఉద్యోగులను అధికారులు అరెస్ట్ చేశారు. రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Also Read:KTR: రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్‌ నోటీసులు

Show comments