ఎలక్ట్రిక్ వాహనాలదారులకు శుభవార్త.. త్వరలో అక్కడ ఛార్జింగ్ పాయింట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL), తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. సబ్ స్టేషన్లలో తగినంత స్థలం ఉన్నందున, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఆర్‌ఈడీసీవోలు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా సిద్ధం కానప్పటికీ, ఈ-వాహన యజమానుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అధికారులు దీనిని దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఛార్జింగ్ యూనిట్లకు విద్యుత్ సరఫరాను పొందడానికి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు తగినంత స్థలం లభ్యత ఉండటంతో సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటుకు అనుగుణంగా ఉంటాయని భావిస్తున్నారు. అనేక సబ్ స్టేషన్లలో ఉన్న ఖాళీ స్థలం, ముఖ్యంగా హైవేలపై సులభంగా 20 వాహనాలకు ఒకేసారి వసతి కల్పించే అవకాశం ఉంటుంది.
Also Read
- Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
- Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
- Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
- Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఆర్‌ఈడీసీవోలు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలపై చర్చించారని, అయితే ప్రక్రియను వేగవంతం చేయడానికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 415 సబ్ స్టేషన్లలోని మిగులు స్థలాన్ని ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 68 నగరాల్లో 2,877 ఈ-వాహన ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది.
ఇంకా, భారతదేశంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ (ఫేమ్ ఇండియా) పథకం యొక్క ఫేజ్-II కింద తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌వేలు, 16 హైవేలలో 1,576 ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయబడ్డాయి. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మంత్రిత్వ శాఖ రూ.1,000 కోట్లు కేటాయించింది. నవంబర్ 8, 2021 నాటికి, తెలంగాణలో 136 ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
-
TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!