బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా ? అయితే, ఇది మీకు చేదువార్తే. పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. తాజాగా భారీగా పెరిగింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.55,000కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000కు ఎగసింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.55 వేల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ.330 పెరిగి.. మరోసారి 60 వేల మార్కును చేరింది.ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.55,150కి చేరగా.. 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ.330 పెరిగి ప్రస్తుతం 60 వేల 150 మార్కును తాకింది.
Also Read:Degree Certificate issue : నా సర్టిఫికేట్లను పబ్లిక్‌గా చెప్పగలను..మోడీపై కేటీఆర్ ట్వీట్!
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.60,000 వద్ద ఉంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.60,150, రూ.60,050, రూ.60,980గా ఉంది. ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.55,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.55,150, రూ.55,050, రూ.55,900గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000గా ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.77,500గా నమోదైంది.
Also Read:Covid-19: ఈ కొత్త వేరియంట్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మాస్క్ తప్పనిసరి