ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాల నుంచి భయపెడుతూనే ఉంది. ఇప్పటికే యావత్త ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్‌తో భయపడుతుంటే.. గత నెల దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే కరోనా బాధితులకు పాక్స్‌లొవిడ్ మాత్ర ఇస్తే 90 శాతం ప్రభావం చూపుతోందని ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ తెలిపింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న కరోనా బాధితులకు ఈ మాత్రతో 90 శాతం వరకు రక్షణ కలుగుతుందని ఫైజర్ వెల్లడించింది.
ప్రాణపాయం లేకంఉడా యాంటి వైరల్ మాత్ర పనిచేస్తోందని ఫైజర్ పేర్కొంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌పైన కూడా పాక్స్‌లొవిడ్ మాత్ర ప్రభావం చూపుతోందని ఫైజర్ ప్రకటించింది. పాక్సలొవిడ్ మాత్ర అనుమతి కోసం అమెరికా, బ్రిటన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఫైజర్ వెల్లడించింది.