అగ్రరాజ్యాన్ని తాకిన ‘ఒమిక్రాన్’.. ఆంక్షలు విధింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. క్రమంగా విస్తరిస్తూ వస్తోంది.. ఇప్పటికే 12 దేశాలను చుట్టేసిన ఈ మహమ్మారి.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను సైతం తాకింది.. గత నెల 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌హౌజ్ ప్రకటించింది. నవంబర్ 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చాడు ఆ వ్యక్తి.. అయితే, 29వ తేదీన అతడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.. మరో విషయం ఏంటంటే.. ఇప్పటికే ఆ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతనితో కాంటాక్ట్ అయిన వారికి కూడా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌గా వచ్చిందని చెబుతున్నారు..
Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. 95 రైళ్లు రద్దు
Also Read
మరోవైపు.. తమ దేశ పౌరులను అప్రమత్తం చేస్తోంది అమెరికా.. అమెరికా పౌరులంతా త్వరగా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, వీలైనవాళ్లు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని సూచించారు చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ.. ఇక, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. కాగా, అమెరికాతో పాటు సౌదీ అరేబియా, యూఏఈలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఒమిక్రాన్ భయంతో వణికిపోతున్న ఆయా దేశాలు ముందస్తు చర్యలను పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు టెస్ట్‌లు తప్పనిసరి చేశాయి.
- Tags
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!