నటసౌమ్యుడు రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 17న రంగనాథ్ జయంతి)
సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున తారాపథం తివాచీ పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని చెప్పవచ్చు. చదువుకొనే రోజుల నుంచీ పలు అంశాలపై కవితలు రాసి, సన్నిహితులను అలరించారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలన్నా, వాటిలో నటించడమన్నా రంగనాథ్ కు ఎంతో ఆసక్తి. బి.ఏ. చదివిన రంగనాథ్ కొంతకాలం రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేశారు. మిత్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని చిత్రాలలో కనీకనిపించని పాత్రలు కూడా పోషించారు. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్ కు హీరోగా అవకాశం లభించింది.
Also Read
రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. పేరుగా తగ్గట్టే సుందర రూపుడు. ఆరడగుల ఎత్తు. చూడగానే ఆకట్టుకొనే రూపం. ‘చందన’ సినిమాతో హీరో అయిన రంగనాథ్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు. సింగీతం శ్రీనివాసరావు, రంగనాథ్ ను ప్రోత్సహించారని చెప్పాలి. తాను తెరకెక్కించిన “జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, అందమె ఆనందం, పంతులమ్మ” వంటి చిత్రాలలో రంగనాథ్ కు హీరోగా అవకాశాలు కల్పించారు. ఈ చిత్రాలు రంగనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే “చదువు-సంస్కారం, సెక్రటరీ, లాయర్ విశ్వనాథ్, రామయ్య తండ్రి, రామచిలక, దేవతలారా దీవించండి, ఇంటింటి రామాయణం, తాయారమ్మ-బంగారయ్య, లవ్ ఇన్ సింగపూర్” వంటి చిత్రాలలో కథానాయకుడుగా, ఉప నాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్. హీరోగా అవకాశాలు తగ్గు ముఖం పట్టగానే కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయ్యారాయన. కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనేక చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ గా హుందాగా నటించి అలరించారు. వైవిధ్యం కోసం ‘గువ్వలజంట, రక్తాభిషేకం” వంటి చిత్రాలలో విలన్ గానూ కనిపించారు. అయితే సదరు చిత్రాలేవీ ఆయనకు అంతగా కలసి రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లో రంగనాథ్ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
కొన్ని టీవీ సీరియల్స్ లోనూ రంగనాథ్ నటించారు. కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ కు మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనూ ఆయన పారితోషికం విషయంలో ఏ నాడూ ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు. నిర్మాత ఎంత ఇస్తే అంతే పుచ్చుకొనేవారు. మృదుభాషి అయిన రంగనాథ్ అంటే చిత్రసీమలో అందరికీ అభిమానమే. ఆయన భార్య ప్రమాదవశాన పక్షవాతానికి గురయినప్పుడు రంగనాథ్ ఆమెకు ఎంతగానో సపర్యలు చేశారు. రంగనాథ్ కు ఇద్దరు కూతుళ్ళు, ఓ అబ్బాయి. భార్య మరణం రంగనాథ్ ను కుంగదీసింది. ఏదో నటనలో పడి అలా అలా నెట్టుకు వచ్చారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్, ఆత్మస్థైర్యం కోల్పోయారు. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సున్నిత మనస్కుడైన రంగనాథ్ ను ఏదో బాధ అలా చేయడానికి దారి తీసి ఉంటుందని అభిమానులు, సన్నిహితులు భావించారు. ఏది ఏమైనా ఆయన హుందా నటనను జనం మరచిపోలేరు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!