ఫేక్ ఆధార్ కార్డు ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆధార్ కార్డే ఆధారం. దీంతో ఆధార్ కార్డు కోసం జనం నానా ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులిస్తూ మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఫేక్ ఆధార్ కార్డ్ ముఠా అరెస్ట్ చేశామన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత కొన్నాళ్ల నుంచి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది ఈ ముఠా.
నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డ్స్ తయారుచేస్తున్నారని, ఎనిమిది మందిని నార్త్ జోన్ టాసకరక ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారని అంజనీకుమార్ తెలిపారు. మరో వ్యక్తి మధ్యప్రదేశ్ వాసి పరారీలో ఉన్నాడన్నారు. ఈ ముఠాకు సంబంధించి ఆధార్ కిట్స్, స్టాంప్స్, ఆధార్ కార్డ్ ఫామ్స్ , ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్, ఫేక్ ఆధార్ కార్డ్ , 80వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫోర్జరీ గెజిటెడ్ సంతకాలతో భారీ మోసం చేస్తోంది ఈ ముఠా.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసి సర్టిఫికెట్స్ ఫోర్జరీ చేస్తున్నారు. మూడువేల ఆధార్ కార్డ్స్ ముఠా జారీచేసిందన్నారు అంజనీకుమార్. ఆ కార్డ్స్ ఫేక్ అని గుర్తించామన్నారు. ఒక్కో కార్డ్ కు వెయ్యి నుండి, రెండువేలు వసూలు చేస్తోంది ముఠా.
తాజావార్తలు
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?