ధర్మ సంకటంలో ధర్మాన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్‌లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో.. సైలెంట్. ఇప్పుడు గేర్‌మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎందుకలా?
ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌తో అలజడి..!
ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందిన ప్రసాదరావు.. చాన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించినా.. ఆ అవకాశం రాలేదు. ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ మౌనంగా ఉండిపోయిన ఆయన.. సడెన్‌గా అధికారపార్టీలో అలజడి రేపుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఏం చేయగలదు అనేది తన మార్కు ప్రసంగాలలో చెప్పేస్తున్నారు ప్రసాదరావు. రాజకీయంగా ఏది ప్లస్సూ.. ఏదీ మైనస్సో వివరించేస్తున్నారు. ఆ మాటల్లో ఎవరికి కావాల్సిన యాంగిల్‌ను వారు వెతుక్కుంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ తనకు అనుకూలంగా కొన్ని.. ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కకూడదని భావిస్తున్న వైసీపీ వర్గాలు మరికొన్ని తీసుకుని చేయాల్సిన రచ్చ చేసేస్తున్నాయి.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
రూ. వంద ఇవ్వకపోతే ఇళ్ల దగ్గరే చెత్త వేయాలని సంచలన కామెంట్
ధాన్యం సేకరణ, ఉపాధి హామీ, రోడ్లు, మౌలిక వసతులపై ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్‌తో అధికారపార్టీ నాయకులే కంగుతిన్నారు. చెత్త పన్ను విషయంలో కాస్త ఘాటుగానే స్పందించారు. వంద రూపాయలు ఇవ్వకపోతే చెత్తను వాళ్ల ఇంటి దగ్గరే ఉంచేయాలని ఆయన చెప్పారు. ఉపాధి హామీ వంటి పథకాలు దేశ ప్రయోజనాలకు విఘాతమని తెలిపారు. పండిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని అధికారులు, మంత్రులు హామీ ఇస్తుంటే.. వరి సాగు దండగని.. ధాన్యం కొనే నాధులే లేరని విమర్శలు చేశారు ప్రసాదరావు. సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడంతో రోడ్లు, మౌలిక వసతుల కల్పన ఆలస్యం అవుతోందని.. ఇకపై అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడతానని ఆయన తెలిపారు. దీంతో సమస్యలు ఉన్నాయని మాజీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు అధికారపార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ధర్మాన ధర్మసంకటంలో పడ్డారా?
కేబినెట్ ప్రక్షాళనపై అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది మంత్రి అయ్యేందుకు చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు సైతం మరోసారి మంత్రి అనిపించేందుకు ఎదురు చూస్తున్నట్టు టాక్. ఆ విషయంలో ఎలాంటి సంకేతాలు వచ్చాయో ఏమో.. కర్ర విరగకుండా.. పాము చావకుండా ఆయన చేస్తున్న విమర్శలు చర్చగా మారుతున్నాయి. ధర్మాన ధర్మ సంకటంలో పడ్డారేమో అన్నది మరికొందరి అనుమానం. మరి.. తాజా కామెంట్స్ ఈ మాజీ మంత్రికి అనుకూలంగా మారతాయో.. ప్రతికూలంగా ఉంటాయో చూడాలి.
- Tags
- ap govt
- dharmana
- ex minister
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!