సినిమా హీరోలకు మించి ఫ్యాన్స్ రాజకీయ నాయకులకు కూడా ఉన్నారు.. ప్రజాసేవతో పాటు తనవెంట నడిచే కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను ఇంటి మనుషుల్లా యోగక్షేమాలు చూసుకుంటూ కొందరు నాయకులు. ఇలా తమపై ప్రేమ ప్రదర్శించే నాయకుల కోసం ప్రాణాలిచ్చేందుకు, రక్తాన్ని దారపోసేందుకు కూడా అభిమానులు వెనకాడరు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నాయకుడే తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. ఈయన చేస్తున్న సేవలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
నేడు మంత్రి పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.. తాను అభిమానించే నాయకుడుకు అలాంటి ఇలాంటి గిఫ్ట్ కాదు చాలా ప్రత్యేకంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ జేఏసి వైస్ ఛైర్మన్, బిఆర్ఎస్ యువనాయకుడు మేడారపు సుధాకర్ భావించాడు. కానీ ఎంతవెతికినా మంత్రిపై అభిమానం ఏస్థాయిలో వుందో తెలియజేసే గిప్ట్ అతడికి కనిపించలేదు.. దాంతో తన శరీరంతో ఏదైనా బహుమతి ఇవ్వాలని భావించాడు.. అలా తన రక్తంతో మంత్రి ఎర్రబెల్లి అద్భుతమైన ఫోటోను గీయించాడు. ఈ బ్లడ్ ఆర్ట్ చాలు సుధాకర్ మంత్రి ఎర్రబెల్లిని ఏ స్థాయిలో అభిమానిస్తున్నాడో తెలియజేయడానికి.. తన ప్రియమైన నాయకుడుకు ఆ ఫోటో ఫ్రెమ్ ను ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నాడు..
ఆ ఫోటోను చూసిన మంత్రి ఎమోషల్ అవుతూ తన వెంటనే ఆలింగనం చేసుకున్నాడు..జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన అతడిని అభినందించడంతో పాటు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.. అభిమాన నాయకుడికి ఏదైనా మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నట్లు సుధాకర్ తెలిపారు.. అందుకే తన రక్తం తో ఫోటో గీయించి బహుమతిగా ఇచ్చానన్నాడు. అభిమానించే నాయకుడి కోసం రక్తం దారపోసినా ఏ బాధా కలగలేదని సుధాకర్ అంటున్నారు.. ఈ ఫ్రెమ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..