కర్ణాటక మాజీ మంత్రులను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి… బెంగళూరులోని శివాజీనగర కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఇంటిపై రైడ్ చేశారు ఈడీ అధికారులు.. కర్ణాటకలో గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో రూ. 400 కోట్లు నొక్కేసినట్టు ఆరోపణలున్నాయి… దీంతో.. రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఆయన ఇంటి నుంచి విలువైన పత్రాలు, డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.. ఐఏంఏ స్కామ్ కేసులో రోషన్ బేగ్ ఆస్తులు అటాచ్ చెయ్యాలని గతంలోనే ఈడీ అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు. ఇదే విషయంలో మాజీ మంత్రి రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. అసలే కర్ణాటక పాలిటిక్స్ రసకందాయంలో ఉన్నాయి.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి కేసులు పెట్టడం… రైడ్స్ చేయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి..
మరోవైపు.. రోషన్ బేగ్ ను 2020 నవంబర్ 23వ తేదీ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కోరమంగలలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు రోషన్ బేగ్ ను హాజరుపరిచారు. రోషన్ బేగ్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో అప్పట్లో రోషన్ బేగ్ ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. అదే జైల్లో ఐఎంఏ స్కామ్ ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఐఎంఏ స్కామ్ లో అప్పట్లో మన్సూర్ ఆలీ ఖాన్, రోషన్ బేగ్ ఒకే జైల్లో ఉన్నా వారిద్దరూ మాట్లాడుకోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతారు.. ఇక, కర్ణాటక మాజీ మంత్రి, చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. గురువారం బెంగళూరులోని శివాజీనగర సమీపంలోని కంటోన్మెంట్ ఏరియాలోని జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసంలో, బెంగళూరులోని చామరాజపేటలోని ఆయన సొంత ట్రావెల్స్ అయిన నేషనల్ ట్రావెల్స్ కార్యాలయంలో, జమీర్ ఖాన్ కు చెందిన అపార్ట్ మెంట్స్ లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఈడీ అధికారులు.. కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రులైన రోషన్ బేగ్, జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం చర్చగా మారింది.
అయితే, ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీఖాన్ తాను మాజీ మంత్రి రోషన్ బేగ్ కు రూ. 400 కోట్లు ఇచ్చానని, డబ్బులు తిరిగి ఇవ్వమంటే రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని రోషన్ బేగ్ మీద గత ఏడాది సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే కేసులో గత ఏడాది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోసన్ బేగ్ కు 2020 నవంబర్ 23వ తేదీన సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.. ఐఎంఏ వ్యవస్థాపకుడు బెంగళూరుతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు మోసం చేసి.. 2019లో దుబాయ్ పారిపోయాడు. 2019 జూన్ 6వ తేదీ న మన్సూర్ ఆలీఖాన్ దుబాయ్ నుంచి అప్పటి బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు ఓ వీడియో పంపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పిస్తే భారత్ వచ్చి లొంగిపోతానని మన్సూర్ ఆలీఖాన్ మనవి చేశాడు. దుబాయ్ లో మన్సూర్ ఆలీ ఖాన్ దెబ్బకు అప్పట్లో బెంగళూరులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు చుక్కలు కనిపించాయి.. కర్ణాటకలో అప్పటి కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఐఎంఏ స్కామ్ కేసు విచారణకు ప్రత్యేకంగా ఎస్ఐటీని నియమించింది. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి బీఎస్. యడియూరప్ప సీఎం అయిన తరువాత ఐఎంఏ కేసును సీబీఐకి అప్పగించారు. 2019 నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు సీబీఐ అధికారులు ఐఎంఏ స్కామ్ కేసు విచారణ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజా, ఈ కేసులో ఈడీ నోటీసులు, రైడ్స్ చర్చగా మారాయి.