NTV Telugu Site icon

Eatala Rajendar: హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..

Eatala Rajendar

Eatala Rajendar

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్, డీజీపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటికీ బయట పెట్టలేదని అన్నారు. ముత్యాలమ్మ గుడి విషయంలో ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించాము.. కొంతమంది బయట వాళ్ళు వచ్చి చెప్పులు వేశారు.. తమ వాళ్ళపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేశారని తెలిపారు. సీఎం.. కొట్టిన పోలీసులకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారని అన్నారు. హత్యయత్నం కేసులు పెట్టారని పేర్కొన్నారు. హిందూ సంస్థలు, బీజేపీ ప్రజల క్షేమాన్నే కోరుకుంటుందని ఈటల రాజేందర్ చెప్పారు. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత ద్వేష భావం.. ప్రశ్నిస్తే మతోన్మాదులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తారని దుయ్యబట్టారు.

Read Also: Paytm Q2 Results: పేటీఎంకి మళ్లీ మంచిరోజులు.. లాభాల్లో కంపెనీ!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఓట్ల రాజకీయం కోసం ఆలయంలో దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక శాంతియుత ర్యాలీ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లిపర్ సెల్స్ ఉన్నాయని, రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతుందని వ్యాఖ్యానించారు.

Read Also: Air India Kanishka bombing case: “ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్” నిందితుడి హత్య కేసులో కీలక పరిణామం..

టెర్రరిస్టులు ఎవరు..? రెచ్చగొట్టేవారు ఎవరు..? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలని ఎంపీ తెలిపారు. హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.. అన్ని వర్గాల క్షేమం కోసం.. సమాజ హితం కోసం పనిచేయాలని ప్రభుత్వానికి చెబుతున్నానని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది.. రక్తపాతాన్ని, దుర్మార్గాన్ని ఏ మత పెద్దలు అంగీకరించరన్నారు. హిందూ కార్యకర్తల అరెస్ట్‌లను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.. చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేమని హెచ్చరించారు. పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు.