మొక్కలు పెరుగుతున్నాయి అంటే ప్రాణం ఉన్నట్టే కదా. ఈ విషయాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. ప్రాణం ఉన్నది అంటే వాటికి భావాలు ఉంటాయి అని అప్పట్లోనే నిరూపించారు. భావాలను వ్యక్తం చేయడమే కాదు, అవి మాట్లాడుకుంటాయి అని చెబుతున్నారు సింగపూర్ కు చెందిన నవ్యాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు. వీరు దీనికోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌ను తయారు చేశారు. వీనస్ ఫ్లైట్రాప్ అనే మొక్కను తీసుకొని దానిపై ఎలక్ట్రోడ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా మొక్కపై ఉన్న ఎలక్ట్రోడ్‌కు విద్యుదావేశాన్ని పంపించారు. వెంటనే వీనస్ మొక్కలో అనేక మార్పులు గమనించారు. ఈ మార్పులను స్కెతస్కోప్ ద్వారా పరిశీలించారు. మొక్కల్లో కలిగే పోషకాహార లోపాలను, తెగుళ్ల వలన కలిగే ఇబ్బందులను, పురుగుమందుల వలన అవి అనుభవిస్తున్న బాధను తెలుసుకొవచ్చని వాటి సంకేతాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: తొలి భూమి ఫొటో ఇదే… ఎప్పుడు తీశారో తెలుసా?