NTV Telugu Site icon

Bhatti Vikramarka: డీఎస్సీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని.. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. ఇంకా 6 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరూ మంచిగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నామన్నారు.

Emergency: ఎమర్జెన్సీ పొరపాటు, ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..

రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసం.. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణ అని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సి ప్రకటించామని పేర్కొ్న్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది.. పదేళ్లు డీఎస్సీని గత ప్రభుత్వం నిర్వహించలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపాత్రయ పడ్డారని తెలిపారు. 5 వేలకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించలేదని.. తమ ప్రభుత్వం రాగానే 11 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు.

Basil Leaves : ఖాళీ కడుపుతో తులసి ఆకులు తింటే ఇన్ని ప్రయోజనాలా.. ఇక అసలు వదలరు..

16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించాం.. 19,718 టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే హాల్ టికెట్లు 2 లక్షల 500కు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని.. మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కొంతమంది పోస్ట్ ఫోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని.. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని చెప్పారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారన్నారు. తమ ప్రభుత్వం మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్ళీ తాము షెడ్యూల్ చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.