మారని సన్‌రైజర్స్ తీరు.. టాప్ స్పాట్‌కు ఢిల్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 సైన్ రైజర్స్ తీరు మారడంలేదు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో రాణించినా, మనీశ్ పాండే బెటర్ పర్ఫామెన్సే ఇచ్చినా… గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. వరుస ఓటముల తర్వాత ఉన్నట్టుండి కేప్టెన్‌ను కూడా మార్చేసింది. ఆరు మ్యాచుల తర్వాత జట్టు కెప్టెన్‌ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను పక్కనబెట్టి, కేన్ విలియమ్సన్‌కు బాధ్యతలు అప్పగించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్ టీమ్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్లాట్‌లో సరైన ఆటగాళ్లు లేరు. మిడిల్ ఆర్డర్ విఫలమవుతుండటం.. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గెలుపు ఓటములు సహజమే. ఆడిన ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం పోటీ ఇవ్వాలి. హైదరాబాద్‌లో అది కన్పించడం లేదు. రెండో ఎడిషన్‌లో ప్రతిమ్యాచ్ హైదరాబాద్‌కు చివరిదే. ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశాలు సజీవంగా ఉంటాయి.
ఇక, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది హైదరాబాద్.. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వెంట వెంటనే ఔటవ్వడంతో స్కోరుపై తీవ్ర ప్రభావం పడింది. సాహా, మనీశ్ పాండే, కేదార్, హోల్డర్ మళ్లీ విఫలమయ్యారు. అబ్దుల్ సమద్ 28, రషీద్ ఖాన్ 22 రాణించడంతో పరువు దక్కింది. హైదరాబాద్ టార్గెట్‌ను ఈజీగా చేధించింది ఢిల్లీ. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ రాణించడంతో ఈజీగా గెలిచింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ఢిల్లీ.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..