నవంబర్ 3, బుధవారం దినఫలాలు…
మేషం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. అధికారులకు తరచూ పర్యటనలు, ఒత్తిడి అధికం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి.
వృషభం : గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చెల్లింపులు, బ్యాంకు చెక్కులు జారీలో జాగ్రత్త అవసరం. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
మిథునం : కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలు అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించండి. అవివాహితులకు శుభదాయకం. ఆరోగ్యం కుదుటపడుతుంది.
కర్కాటకం : రిటైర్డు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఉద్యోగ, విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం.
సింహం : వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆకస్మిక ధన లాభం, కార్యసిద్ధి. దైవ సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సమసిపోతుంది. నిర్ధిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతాయి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు.
కన్య : ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయిల కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సంప్రదింపులు, వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఆదాయానికి తగ్గుట్టుగా ఖర్చులుంటాయి.
తుల : ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటాబయటా అనుకూలతలుంటాయి. ఖర్చులు, అధికం, ప్రయోజనకరం. బంధుమిత్రులకు సహాయ సహకారాలందిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లభాలు గడిస్తారు. వృత్తులు వారికి అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది.
వృశ్చికం : హామీలు, నగదు చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వైద్యులకు బాధ్యతల్లో అలక్ష్యం మంచిదికాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. ప్రయాణం కలిసివస్తుంది. ఇతరుల ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనస్సు : ఉద్యోగస్తుల కనిష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాజకీయాల్లో వారికి పదవులు సభ్యత్వాలకు మార్గం సుగమమవుతుంది. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
మకరం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం పొందుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. రుణ వాయిదాలు, పన్నులు, ఫీజులు సకాలంలో చెల్లిస్తారు.
కుంభం : ఆదాయం సంతృప్తికరం. రుణ విముక్తులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. గృహ నిర్మాణల పనుల ప్రారంభంలో మందగించినా క్రమేపీ వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే సూచనలు అధికంగా ఉన్నాయి.
మీనం : మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందివస్తాయి. ఉద్యోగస్తులు గుట్టుగా ప్రమోషన్ యత్నాలు సాగించాలి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం.
తాజావార్తలు
-
IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
-
Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
-
మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
-
PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ
-
Prakash Raj: “త్వరలో వస్తున్నా.. మీ అందరికీ సమాధానం చెస్తా”.. “శ్రీరాముడి” వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన స్టేట్‌మెంట్
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!