NTV Telugu Site icon

Daaku Maharaaj: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నాగవంశీ కీలక ప్రకటన

Naga Vamsi

Naga Vamsi

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు.

Daaku Maharaaj: ప్రీ రిలీజ్ చేయలేకపోయాము.. అక్కడే సక్సెస్ మీట్!

సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.

Sankranthi 2025: కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు..

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, 2023 సంక్రాంతి వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చాను. సంక్రాంతి అనేది నాకు మరింత ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్ కావచ్చు, విజయ్ కార్తీక్ కావచ్చు.. అద్భుతమైన టీమ్ వల్లే ఈ అవుట్ పుట్ వచ్చిందని చెప్పవచ్చన్నారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? అని అడిగితే సీక్వెల్ చేసే ఆలోచన లేదు గాని ఫ్రీక్వెల్ చేసే ఆలోచన ఉందని నేను మాత్రం నాగ వంశీ వెల్లడించారు. బాబీ చెప్పిన ఐడియా తనకు నచ్చిందని దానిమీద వర్కౌట్ చేస్తామని అన్నారు.

Show comments