ఏపీలో సీపీఐ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి తరచూ లేఖలు రాస్తుంటారు సీపీఐ నేత రామకృష్ణ. తాజాగా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు.
పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు 2021 అక్టోబర్ నాటికే రెండేళ్లు పూర్తైందని, తక్షణమే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసి.. పే స్కేల్‌ను అమలు చేయాలని లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు.