పడగ విప్పిన ‘ఒమిక్రాన్’.. ఊహించని విధంగా వ్యాప్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 13 దేశాలకు వ్యాప్తి చెందింది.. అంటే.. అది ఎంతవేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.. దీంతో కట్టడికి పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. సరిహద్దులను మూసివేశాయి. ఇదే సమయంలో విదేశాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది భారత ప్రభుత్వం.. వచ్చే నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని మొదట నిర్ణయించినా.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఆ నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని భావిస్తోంది.. ఇతర దేశాల్లో వరుసగా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండడంతో.. రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… ఇక, వైరస్ భయాలతో పలు రాష్ర్టాలు కూడా కఠిన ఆంక్షలకు పూనుకుంటున్నాయి.
ఇప్పటికే 13 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది.. సౌతాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన 600 మందిలో 61 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని నెదర్లాండ్స్ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే కాగా.. అందులో 13 మందికి ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వేరియంట్ వెలుగుచూశాక ఒక దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా నుంచి రాకపోకలపై ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఈయూ, ఇరాన్, జపాన్, న్యూజిలాండ్, థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, నేపాల్ తదితర దేశాలు నిషేధం కూడా విధించాయి. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను దేశంలోకి అనుమతించబోమని ఆదివారం ఇజ్రాయెల్, మొరాకో వెల్లడించాయి. అయితే, వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రపంచ సుందరీమనుల పోటీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్‌వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అంటే ఆసక్తి చూపించనివారు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక, వ్యాక్సిన్ వేసుకున్నవారిపై కూడా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావమే చూపుతుందని హెచ్చరికలు ఉన్నాయి.. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. దాని బారినపడకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!