షార్‌లో కరోనా టెర్రర్.. 12మందికి పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి వచ్చారు. ఇలా వచ్చిన వారు మళ్లీ ఉద్యోగ విధుల్లోకి రావాలంటే పరీక్షలను షార్ అధికారులు తప్పనిసరి చేశారు. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు.
సూళ్లూరుపేటలోని ఉద్యోగుల కాలనీల్లో పరీక్షలను ముమ్మరం చేశారు. ముందస్తు అనుమతి తోనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని..వచ్చిన తర్వాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. తర్వాతే విధులకు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లు వాడాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు షార్ ఉన్నతాధికారులు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు.
Also Read
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!