31 నుంచి పార్లమెంట్ .. కోవిడ్ విజృంభణతో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను షిఫ్ట్‌లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా నిర్వహించేందుకు వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు కోవిడ్ పరిస్థితినిబట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఈ నెల 25న లేదా 26న సమావేశమై సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలో నిర్ణయిస్తారన్నారు. కొందరు పార్లమెంటు సభ్యులకు కోవిడ్ సోకినందువల్ల ఈ సమావేశాల కాలాన్ని కుదించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికలు కూడా పార్లమెంటు సమావేశాల కుదింపునకు కారణం కావచ్చునని తెలిపారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఓ నెల విరామం అనంతరం రెండో దశ సమావేశాలు మార్చి 14న ప్రారంభమై, ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఇటీవల దాదాపు 400 మంది పార్లమెంటు సిబ్బంది కోవిడ్-19 వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా మంగళవారం పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణకు సంబంధించిన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు. వయసు 60 ఏళ్ళు పైబడిన ఎంపీల పట్ల మరింత శ్రద్ధవహించాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!