కాంగ్రెస్ పట్టు: కేంద్ర మంత్రిని తొలగించాల్సిందే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు రాష్ట్రపతిని కలిశారు. లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. ఘటనపై స్వతంత్ర బృందంచేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కోరారు. అంతేకాకుండా, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రం అందజేసిన తరువాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖింపూర్ ఘటనలో తమవి రెండే రెండు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి, రెండోది కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రా పదవికి రాజీనామా చేయాలి లేదా ఆయన్ను తొలగించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మిశ్రా పదవిలో ఉన్నతంత వరకు రైతులకు న్యాయం జరగదని, ఆయన రైతులను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు.
Read: టీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల సందడి…
Also Read
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!