టీఆర్ఎస్ పార్టీలో ఎన్నిక‌ల సంద‌డి…

టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, గ్రామ‌, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీలు పూర్త‌య్యాయ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైన‌ట్టు కేటీఆర్ తెలిపారు.  2019 ఎన్నిక‌ల కార‌ణంగా పార్టీ ప్లీన‌రీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌లేక‌పోయామ‌ని, ఆ త‌రువాత క‌రోనా కార‌ణంగా రెండేళ్లపాటు ప్లీన‌రీని నిర్వ‌హించ‌లేద‌ని, న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో విజ‌య‌గ‌ర్జ‌న జ‌రుగుతుంద‌ని అన్నారు.  ఇక పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.  అక్టోబ‌ర్ 17 వ తేదీన ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్ చేస్తామ‌ని, అక్టోబ‌ర్ 22 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని, అక్టోబ‌ర్ 25 న పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుంద‌ని అన్నారు.  అద్య‌క్షుడి ఎన్నిక అనంత‌రం అదే రోజున జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఉంటుంద‌ని అన్నారు.  పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ హైటెక్స్‌లో నిర్వ‌హిస్తామ‌ని అన్నారు.  సుమారు 13 వేల మంది ప్ర‌తినిధులు ఈ అధ్య‌క్ష ఎన్నిక స‌మావేశంకు వ‌స్తార‌ని తెలిపారు.  న‌వంబ‌ర్ 15 న వ‌రంగ‌ల్‌లో జ‌రిగే విజ‌య గ‌ర్జ‌న‌కు ల‌క్ష‌లాది మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, ప్ర‌జ‌లు క‌దిలి వ‌స్తార‌ని కేటీఆర్ తెలిపారు.

Read: తెలంగాణ‌లో బొగ్గుగ‌నుల‌పై కేంద్రం దృష్టి… ఇత‌ర ప్రాంతాల‌కు పంపాల‌ని ఆదేశం…

-Advertisement-టీఆర్ఎస్ పార్టీలో ఎన్నిక‌ల సంద‌డి...

Related Articles

Latest Articles