Congress : అదానీ గ్రూప్‌కు చైనా కంపెనీతో సంబంధాలు.. దేశ భద్రతకు ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అదానీ వ్యవహారం కుదిపేసింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం అదానీ వ్యవహారంపైనే చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అదానీ గ్రూప్ పై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అదానీ గ్రూప్‌కు చైనా కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Also Read:Pocharam Srinivas Reddy : కొత్త బిచ్చగాళ్లకు కేసీఅర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు
చైనాకు చెందిన చాంగ్ చియాన్ టింగ్ యాజమాన్యంలోని కంపెనీ – అదానీ గ్రూప్‌కు సబ్‌కాంట్రాక్టర్ అని అదానీ సోదరుడి భాగస్వామి అని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా ష్రినేట్ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను చైనా మూడుసార్లు మార్చిందన్నారు. అయితే చైనా యాజమాన్యంలోని కంపెనీకి అదానీ గ్రూప్‌తో ఉన్న లింక్‌లు చైనాతో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని చూపుతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా దేశ వ్యతిరేకం అని ఆమె అన్నారు.ఇది జాతీయ భద్రతకు ముప్పు కాకపోతే ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు. ఈ సంబంధం కారణంగానే మోడీ చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని, అందుకే చైనా లేదా అదానీ సమస్యపై ఆయన ఇంకా మౌనం వీడలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆరోపించారు.చైనీస్ కంపెనీపై ప్రభుత్వం ఎప్పుడు విచారణ జరుపుతుంది? అని నిలదీశారు. అదానీ గ్రూప్‌కు చెందిన షెల్ కంపెనీల్లో డిపాజిట్ అయినట్లు ఆరోపించబడిన రూ. 20,000 కోట్ల మూలాన్ని కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read:Kishan Reddy : బంగారు తెలంగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్లో మాట్లాడుతూ.. ‘చైనీస్‌పై ప్రధాని మౌనంగా ఉండడానికి కారణం రోజురోజుకూ స్పష్టమవుతోంది. అదానీకి చైనాతో ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణం. ‘హమ్ అదానీకే హై కౌన్’ సిరీస్‌లో మేము దీనిని మొదట మార్చి 3న ప్రస్తావించాము మరియు ఈ రోజు మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి అంటూ ఆయన ట్వీట్ చేశారు.
HAHK is beginning to bite. https://t.co/4sHat80Yl5
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 7, 2023
ఈ వ్యాఖ్యలపై న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చేసిన ట్వీట్‌పై రిజిజు స్పందిస్తూ, “సున్నితమైన విషయాలపై వ్యాఖ్యానించవద్దు. అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చైనా పౌరులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని రమేష్ ఆరోపించారు. ఇది దేశ భద్రతకు విఘాతం కలిగిస్తోందా” అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన సరిహద్దు కంటే అభివృద్ధి చెందని సరిహద్దు సురక్షితమైనదని భారతదేశం చాలా కాలంగా సరిహద్దులను అభివృద్ధి చేయకూడదనే విధానాన్ని కలిగి ఉందని అప్పటి రక్షణ మంత్రి AK ఆంటోనీ లోక్‌సభలో ఉద్దేశపూర్వకంగా చెబుతున్న వీడియోను కూడా న్యాయ మంత్రి పంచుకున్నారు.
Also Read:Amit Shah: ప్రజాస్వామ్యం కాదు, రాజవంశమే ప్రమాదంలో ఉంది.. రాహుల్‌పై షా కీలక వ్యాఖ్యలు
మరోవైపు భారతదేశంలోని కీలకమైన ఓడరేవులు, ఎయిర్‌స్ట్రిప్‌లు, రైల్వే ట్రాక్‌లు, విద్యుత్ లైన్లను చైనా కంపెనీ ఎందుకు నిర్మిస్తోంది, నియంత్రిస్తోంది? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత సరిహద్దులో చైనా అనేక అతిక్రమణలు చేసి 20 మంది మన సైనికులను హతమార్చిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
संवेदनशील मामलों पर टिप्पणी न करें। कांग्रेस के पास अरुणाचल प्रदेश के बारे में बोलने का कोई नैतिक अधिकार नहीं है। पहले इस हकीकत का जवाब तो दो।👇 https://t.co/z33qP6JhPG pic.twitter.com/YiT4NtwMMf
— Kiren Rijiju (@KirenRijiju) April 6, 2023
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!