పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. కేసీఆర్ ప్రకటన

నామినేటెడ్‌ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్..

  • తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత.
  • తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్.
  • తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు.
  • తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్.
  • తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు సీఎం కేసీఆర్.. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.