Shankh Mitra: ఎలాన్ మస్క్‌కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్‌లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
- వేతనంలో ఎలాన్ మస్క్‌కు ధీటుగా భారతీయుడు
- భారీ పారితోషికాన్ని అందుకున్న కార్పొరేట్‌గా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త శంఖ్ మిత్రా ప్రపంచ కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారారు. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REIT) సంస్థ వెల్‌టవర్ (Welltower) సీఈఓగా ఉన్న ఆయన.. 2025లో 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లకు పైగా) విలువైన భారీ పారితోషికాన్ని అందుకున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓల జాబితాలో ఎలాన్ మస్క్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు.
40 శాతం పెరిగిన పారితోషికం
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. శంఖ్ మిత్రా పారితోషికం గతంతో పోలిస్తే 40 శాతం పెరిగి 821 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 99 శాతం స్టాక్ గ్రాంట్ల రూపంలోనే ఉంది. 2025 అక్టోబర్‌లో మాత్రమే ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కేటాయించినట్లు వెల్లడైంది. అయితే ఈ మొత్తం వెంటనే ఆయన చేతికి రాదు. ఒప్పందం ప్రకారం.. కేటాయించిన షేర్లలో సగం 2031 వరకు సంస్థలో కొనసాగితేనే లభిస్తాయి. మిగిలిన సగం షేర్లు వెల్‌టవర్ మార్కెట్ విలువ 45 శాతం పెరగడం, కంపెనీ షేర్లు ప్రధాన స్టాక్ సూచీలను అధిగమించడం వంటి పనితీరు లక్ష్యాలను సాధించిన తర్వాతే అందుతాయి.
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
భారత్‌లో చదువు.. అమెరికాలో కెరీర్
శంఖ్ మిత్రా భారత్‌లో జన్మించి విద్యాభ్యాసం పూర్తి చేశారు. కోల్‌కతాలోని ప్రముఖ జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం అమెరికాకు వెళ్లి కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్లో ఎంబీఏ పూర్తి చేశారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) సంస్థలో ఐదేళ్లకు పైగా పనిచేశారు. అనంతరం ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, మిలీనియం పార్ట్నర్స్ వంటి ప్రముఖ సంస్థల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో నిర్వహణ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
వెల్‌టవర్‌లో ఎదుగుదల
2016లో వెల్‌టవర్ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన శంఖ్ మిత్రా.. పెట్టుబడుల విభాగాధిపతి, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక పదవులు చేపట్టారు. 2020 అక్టోబర్‌లో సంస్థ సీఈఓగా నియమితులయ్యారు. డేటా ఆధారిత పెట్టుబడి వ్యూహాలు, వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా సంస్థను వేగంగా అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం అమెరికాలో లిస్టెడ్ ప్రధాన REIT సంస్థకు నాయకత్వం వహిస్తున్న కొద్ది మంది భారతీయ మూలాల సీఈఓల్లో శంఖ్ మిత్రా ఒకరిగా నిలిచారు. ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయ ప్రతిభ మరోసారి చాటిచెప్పిన శంఖ్ మిత్రా విజయం.. యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు