NTV Telugu Site icon

జగన్ గుడ్ న్యూస్.. వృద్ధాప్య పెన్షన్ పెంపు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జ‌న‌వ‌రి 1, 2022 నుంచి పెన్షన్ రూ.2500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్‌.జగన్‌ సర్కార్‌ కానుక అందించింది. పెన్షన్‌ను రూ.2500కు పెంచి ఇవ్వనుంది ప్రభుత్వం. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో రూ.2500 పెన్షన్ మొత్తాన్ని పెట్టనుంది వైయస్‌.జగన్‌ సర్కార్‌. కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్.

డిసెంబర్, జనవరిల్లో కార్యక్రమాలను జగన్ వివరించారు. స్పందన వీసీలో వెల్లడించారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. డిసెంబర్‌ 21న సంపూర్ణ గృహహక్కు పథకం అమలుచేస్తారు. డిసెంబర్‌ 28న ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పొరపాటున మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ జరుగుతుంది. జనవరి 1, 2022న న పెన్షన్‌కానుక కింద పెన్షన్లు రూ.2,500కు పెంచుతారు. జనవరి 9న ఈబీసీ నేస్తం అమలుచేస్తామని జగన్ తెలిపారు. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు అందచేస్తారు. జనవరిలోనే రైతు భరోసా. తేదీ త్వరలోనే ప్రకటిస్తామని జగన్ వెల్లడించారు.