మీడియా ముందే బోరున విలపించిన చంద్రబాబు

ఏపీ రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, తన భార్యను కూడా అవమానిస్తున్నారంటూ చంద్రబాబు సభను వెళ్లిపోయారు. అంతేకాకుండా ఇక సభలోకి ముఖ్యమంత్రిని అయ్యాకే అడుగుపెడుతానంటూ శపథం చేశారు.

అనంతంర తన ఛాంబర్‌లో టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మీడియాతో మాట్లాడుతూనే చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా బోరున విలపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారని.. బండబూతులు కూడా తిడుతున్నారని ఆయన వైసీపీపై ఆరోపణలు చేశారు.

Related Articles

Latest Articles