NTV Telugu Site icon

పరువు నష్టం కేసు.. రేవంత్‌రెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు… రేవంత్‌రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది… పరువు నష్టం కేసులో ఇంజెక్షన్‌ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్.. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది కోర్టు.. కాగా, తనపై రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు.. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.. దీంతో.. రేవంత్‌రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది సిటీ సివిల్ కోర్టు.. డ్రగ్స్ కేసులో.. ఈడీ కేసులో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు.. ఇక, సోషల్ మీడియా మీడియాలో ఉన్న లింక్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్‌ 20వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.. కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డిని ఆదేశించింది.