కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలా కుతలం చేస్తున్నది. కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది. అయినప్పటికీ ఇప్పటి వరకు మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు. ఎప్పటి కప్పుడు కొత్తగా మార్పులు చెందుతూ విరుచుకుపడుతున్నది. దేశాల ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తోంది కరోనా. ఇక, కరోనా కట్టడికి ప్రతీ దేశం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ వస్తున్నాయి. అన్నింటికంటే అధికంగా బ్రిటన్ కరోనా కట్టడికోసం ఖర్చు చేసింది. సుమారు 37 బిలియన్ పౌండ్లను కరోనా కట్టడి కోసం వినియోగించింది. విడ్ పరీక్షలు, ట్రేసింగ్ కోసమే ఈ డబ్బు ఖర్చు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. టెస్టులు, ట్రేసింగ్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. యూరోపియన్ దేశాలన్నింటిలోకి బ్రిటన్‌లోనే అత్యధిక కరోనా టెస్టులు నిర్వహించామని, ఫలితంగా ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని ప్రభుత్వం చెబుతున్నది.
Read: ఉద్యోగులకు లేడీ బాస్ కళ్లు చెదిరే ఆఫర్… ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు…