దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ “ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకూ మేము సినిమాను ప్లెజంట్ గా చేశాము. ఈ కథ ఎలాంటిది అని తెలియాలా ? మీకు. చైతూ ఈ వేడుకకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అఖిల్ అక్కినేని లాయర్ ఫ్యాన్స్ ఎప్పటికి మీ వెనుక ఉంటారు. కానీ నా డ్యూటీ ఏంటి అంటే ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులకూ అఖిల్ ను దగ్గర చేయాలి. అది ఈ సినిమాతో ఖచ్చితంగా జరుగుతుంది. అఖిల్ ను ఈ సినిమాలో ఒక కొత్త కోణంలో చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పూజా హెగ్డే నన్ను సర్ప్రైజ్ చేసింది. నటనలో ఒక కొత్త పూజా హెగ్డేను చూస్తారు. ఇవాళ సినిమాలో ఉన్న హీరోయిన్ పేరు ‘విభ’ వెనక ఉన్న ఒక సీక్రెట్ కూడా మీకు చెప్తాను. నా పెద్ద కూతురు పేరు బొమ్మరిల్లు హాసిని, చిన్న కూతురు పేరు విభ. ఈ క్యారెక్టర్ కు ధైర్యంగా నా కూతురు పేరు పెట్టాను. ఎందుకంటే ఒక చిన్న కోపం నుంచి ఈ కథ మొదలైంది. ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లను తయారు చేస్తూనే ఉంది. వీళ్ళలో మనకు నేర్పిస్తున్న, నేర్పించిన విషయాలు ఏంటనే చిన్న ప్రయత్నమే ఈ కథ. అలాగే నా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” అంటూ సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also : పూజ హెగ్డే గ్లామర్ నాకు బాగా నచ్చింది : అల్లు అరవింద్
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెషన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు బొమ్మరిల్లు భాస్కర్.