బీజేపీది రైతు పక్షం.. అందుకే బియ్యం కొంటున్నాం-రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బియ్యం రాజకీయం బాగా పండుతోంది. కేంద్రం రైతుల పక్షం కాబట్టే 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా మరో ఆరు లక్షల టన్నులు బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు బీజేపీ శాసనాసభా పక్షం నేత రాజాసింగ్. కేంద్రం లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన అర్థం లేనిది. వాళ్లు ఢిల్లీ వెళ్లక ముందు, వెళ్లొచ్చిన తరువాత కూడా కేంద్రం పదేపదే రా రైస్ కొంటామనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ మంత్రులు దీన్ని రాజకీయం చేయాలనే దురుద్దేశంతో పని లేక ఢిల్లీకి వెళ్లి ప్రజల డబ్బును వృధా చేశారు.
ఆడంబరాలకు, విహార యాత్ర కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ తమ పనులు చక్క బెట్టుకుంటున్నారే తప్ప వారికి ప్రజల శ్రేయస్సు ఏ మాత్రం పట్టకపోవడం సిగ్గుచేటు. గతంలో చెప్పిన విధంగానే యాసంగిలోనూ రా రైస్ కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రైతుల నుండి ధాన్యం కొనబోమని ప్రకటించడం గర్హనీయం.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను ఇకనైనా ఉఫసంహరించుకోవాలి. అబద్ధాల లెక్కలతో ప్రజలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పై నెపం వేసి తప్పించుకోవాలనే ప్రయత్నం సీఎం కేసీఆర్ కు ఏమాత్రం సరికాదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎం, రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మెడలు వంచినట్లుగా, మాట్లాడటం సరికాదు.
మెడ మీద కత్తి పెడితే బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రానికి లేఖ రాసిచ్చినట్లుగా చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేంద్రం మెడలు వంచినట్లుగా చెప్పడం సిగ్గు చేటు. ఇకనైనా రాజకీయ దురుద్దేశం పూరితంగా వ్యవహరించడం మాని సమాఖ్య స్ఫూర్తి తో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వరి ధాన్యాన్ని పూర్తిగా రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రాజాసింగ్
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!