పెగాసస్ స్కామ్ ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది.. పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులతో వాయిదా పడుతూనే ఉన్నాయి.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏరోజు కూడా సజావుగా సాగింది లేదు.. లోక్‌సభతో పాటు పెద్దల సభలోనూ పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. బీజేపీయేతర పక్షాలన్నీ ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి.. అయితే, ఇప్పుడు బీజేపీ భాగస్వామ్య పక్షాల నుంచి కూడా మోడీ సర్కార్‌కు సెగ ప్రారంభం అయ్యింది… పెగసస్ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. దీంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తును డిమాండ్ చేసిన మొట్టమొదటి బీజేపీ భాగస్వామ్యపక్షంగా జేడీ(యూ) నిలిచినట్టు అయ్యింది.
దీంతో.. పెగాసస్ పై దర్యాప్తు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ మద్దతు ఇచ్చినట్టు అయ్యింది.. ఇవాళ పాట్నాలో నితీష్ మీడియాతో మాట్లాడుతుండగా.. మీడియా ప్రతినిధులు ఈ అంశంపై దర్యాప్తు చేయాలా అని అడిగినప్పుడు.. ఆ ప్రశ్నకు స్పందించిన నితీష్ కుమార్.. వాస్తవానికి ఇది జరగాలి అని చెప్పారు.. ఇది ఖచ్చితంగా చర్చించాలి, పరిశీలించాలి.. మొత్తం బహిరంగ పర్చాలని వ్యాఖ్యానించారు.