తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ప్రసారం అవుతుంది.. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో అప్పుడే గొడవలు, లవ్ ట్రాక్ లు మొదలయ్యాయని జనాలు అంటున్నారు.. జరుగుతున్నది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.. ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గత సీజన్ల మాదిరిగానే కొందరు కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు..
ఈ సీజన్ మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇందులో శోభాశెట్టి, రతిక, ప్రిన్స్ యవర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, షకీలా, గౌతమ కృష్ణ, సింగర్ దామిని ఉన్నారు. సెప్టెంబరు 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మెుదలైంది. అయితే గత సీజన్ల మాదిరిగా కాకుండా.. ఈ సారి ఓటింగ్ వేసే విధానాన్ని చేంజ్ చేశారు. ఈసారి ఒక్కరికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికీ వరకు తెలిసిన సమాచారం మేరకు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు.
ఎవ్వరికి లేనంతగా అతనికి ఊహించని రేంజ్ లో ఓట్లు పడుతున్నాయి. ఇతని తర్వాత ప్లేస్ లో యంగ్ హీరో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ప్రశాంత్ తర్వాత ఇతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.. ఆ తర్వాత స్థానంలో రతిక ఉంది.. షకిలా, దామిని, ప్రిన్స్ యవర్, శోభాశెట్టి కొనసాగుతున్నారు. చివరి ప్లేస్ లో కిరణ్ రాథోడ్ ఉంది. అందరి కంటే తక్కువ ఓట్లు ఆమెకే పడ్డట్లు తెలుస్తోంది. ఆమె పెద్దగా తెలియకపోవడం, తెలుగు రాకపోవడం కిరణ్ కు మైనస్ అయ్యాయి. ఓటింగ్ క్లోజ్ అవ్వడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, ఆట సందీప్, టేస్టీ తేజ సేఫ్ సైడ్‍లో ఉన్నారు.. ఓట్లు ప్రకారం చూసుకుంటే కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందా లేక మరొకరుకు బిగ్ బాస్ గుడ్ బై చెప్పేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది..