Site icon NTV Telugu

ఈటల రాజేందర్‌కు షాక్.. ఇద్దరు ప్రధాన అచరుల గుడ్‌బై..!

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్‌, చుక్కా రంజిత్‌.. ఆయనకు గుడ్‌బై చెప్పేశారు.. వీరిలో పింగిలి రమేష్ సింగిల్‌ విండో వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఓవైపు హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఏలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఈటల రాజేందర్‌.. తన పాత అనుచరులతో కపులుపుకుని.. బీజేపీ శ్రేణులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.. కానీ, అప్పుడప్పుడు కొందరు ఈటలకు షాక్ ఇస్తూ.. ఆయనకు దూరం కావడం.. ఈటల శిబిరంలో ఆందోళనకు కారణం అవుతోంది. మరోవైపు.. హుజురాబాద్‌ బైపోల్‌లో విక్టరీ కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. ఈ నియోజకవర్గం నుంచి.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకాన్ని సైతం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్న ఈటల.. క్రమంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతుండగా.. పింగిలి రమేష్‌, చుక్కా రంజిత్‌.. మరికొందరు ఇవాళ బీజేపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరడం చర్చగా మారింది.

Exit mobile version