తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం దానిమీదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని హుస్నాబాద్‌లో బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర పూర్తైన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ స్వాగత సభ అని, బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంలో మొదటి సంతకం చేస్తామని అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని, స్కూళ్లను అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. 36 రోజులపాటు, 348 కిమీ మేర పాదయాత్ర చేసినట్టు ఆయన పేర్కొన్నారు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు ఎవరికోసం కడుతున్నారని, పాదయాత్రలో ఎవర్ని అడిగినా ఒక్క చుక్కనీరు కూడా రాలేదని చెబుతున్నారని, వరిస్తే ఉరి ఎందుకు అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈనెల 30 వ తేదీన హుజురాబాద్‌కు ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం విశేషం. హుజురాబాద్‌లో తప్పకుండా గెలుస్తామని ఈటలతో పాటుగా బీజేపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. మరి ప్రజల మనసుల్లో ఏమున్నదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Read: ఎల్బీనగర్ను ఇండియా పాక్ సరిహద్దుల్లా మార్చారు…
Also Read
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!