NTV Telugu Site icon

Bandi Sanjay: నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు

Bandi Sanjay Ktr

Bandi Sanjay Ktr

టీఎస్‌పీఎస్పీ పేప‌ర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చట్ట, న్యాయబద్దంగా తగిన సమాధానమిస్తాం అని తెలిపారు. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతామన్నారు. అంతే తప్ప కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ట్విట్టర్ టిల్లును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.”టీఎస్పీఎస్సీతో సంబంధం లేదని కేటీఆర్ చెప్పడం పెద్ద జోక్. ఆయనది నాలుకా? తాటిమట్టా? ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప టీఎస్పీఎస్సీ తప్పిదం లేనే లేదని ఎట్లా చెబుతారు? లీకేజీ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని ఎట్లా ఆరోపిస్తారు? రాష్ట్రంలోని అన్ని శాఖల తరపున వకాల్తా పుచ్చుకుని ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. మంత్రిగా ఉంటూ ట్విట్టర్ టిల్లు స్పందిస్తే తప్పు లేనప్పుడు… ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా మేం మాట్లాడితే తప్పేముంది? ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే కొత్త సాంప్రదాయానికి ట్విట్టర్ టిల్లు తెరలేపడం సిగ్గు చేటు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై నోరెత్తకుండా ప్రతిపక్షాలను అణిచివేసే కుట్రలో భాగమే ఇది” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read:TSPSC Paper Leakage: పేపర్‌ లీకేజీపై నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్

తన వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బెదిరించడం, కేసులు పెట్టడం, తమ తాబేదారు సంస్థలతో నోటీసులు ఇప్పించడం, అరెస్ట్ చేయించడం కేసీఆర్ సర్కార్ కు అలవాటుగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. వీటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. చట్ట, న్యాయపరంగా నోటీసులకు సమాధానమిస్తాం. రాజకీయంగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. పంట నష్టం కింద రైతులకు కేంద్రం పైసా సాయం చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్దం అని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు సాయం చాలా గొప్ప విషయమని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం SDRF నిధుల నుండి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తోందన్నారు. ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానివే అని గుర్తు చేశారు. కేంద్రం పైసా ఇవ్వలేదని చెబుతే ప్రజలు నవ్వుకుంటున్నారనే సోయి లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం విడ్డూరం అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Also Read:India Ramadan: ఆకాశంలో నెలవంక.. రేపటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు

కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం బాగోలేదని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్ని్ంచారు. ఆ పథకం ద్వారా సాయం అందకుండా రైతుల నోట్లో ఎందుకు మట్టికొట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లైనా ఇంతవరకు సమగ్ర పంటల విధానాన్ని, బీమా పాలసీని తీసుకురాకుండా కేంద్రంపై బురద చల్లుతున్నారని బండి సంజయ్ విమర్శించారు.