ఈరోజు జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేటి ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(85) పరుగులతో రాణించడం వల్ల ఆ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ కేవలం 5 పరుగులు చేసే ఔట్ అయిన మరో ఓపెనర్ వార్నర్ (53) అర్ధశతకం పూర్తి చేసాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతంగా రాణిస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండగా మాక్స్‌వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసాడు. ఇక ఆసీస్ కు చివరి 14 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా… మాక్స్‌వెల్ బౌండరీతో ఆసీస్ జట్టు మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.