నవంబర్ 9, మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.
వృషభం :- అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్టాక్ నిల్వలో మెళుకువ అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. నూనె, మిర్చి, కంది వ్యాపారకస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకర సమయం. చాకచక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
కర్కాటకం :- వస్త్ర, గృహోపరకణాలు, బంగారు, వాహనాల వ్యాపారులకు లాభదాయకం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు.
సింహం : – ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. బంధువులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
కన్య :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. రుణ విముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
తుల :- బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అసాధ్యమనుకున్న వ్యవహారం సునాయాసంగా సానుకూలమవుతుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
వృశ్చికం :- స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సహకార సంస్థలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. పాత మిత్రులను కలుసుకుంటారు.
ధనస్సు :- అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. నిశ్చింతగా ఉండండి మీ సమస్యలు ఇబ్బందులు అవే సర్దుకుంటారు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
మకరం :- వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి పురోభివృద్ధి. పాత సమస్యల నుండి బయటపడతారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
కుంభం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు రాబడికి మించటంతో చేబదుళ్ళు స్వీకరిస్తారు. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. మీ కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
మీనం :- పారితోషికాలు అందుకుంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!