నవంబర్ 6, శనివారం దినఫలాలు…గృహ నిర్మాణాలు, వ్యాపారాల్లో లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.
వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. స్త్రీలకు పుట్టింటి నుంచి శుభవార్తలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.
Also Read
మిథునం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. సంతానం, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
కర్కాటకం :- ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరవుతాయి. ఇతరులను సాయం చేసి ఆదుకోవాలనే తలంపుతో చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వనసమారాధనలు, దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం.
సింహం :- వృత్తిరీత్యా ప్రయాణాలు, చికాకులు ఎదుర్కుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ దర్శనాలలో అటంకాలను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం.
కన్య :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. రుణవిముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారకుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
తుల :- కొబ్బరి, పండ్లు, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏ విషయంలోను మీ శ్రీమతికి ఎదురు చెప్పటం మంచిది కాదు. సోదరి, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి.
వృశ్చికం :- సహోద్యోగులతో సఖ్యత లోపిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తి కావు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది.
ధనస్సు :- ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. అసాధ్యమనుకున్న దానిని సాధించి మీ సత్తాచాటుకుంటారు.
మకరం :- స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తప్పవు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు.
కుంభం :- బ్యాంకు ఉద్యోగులు విధినిర్వహణలో అలసత్వంతో ప్రమాదంలో పడే సూచనలున్నాయి. స్త్రీలు శుభకార్యాలలో కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం :- విద్యార్థినులు భయాందోళనలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నా ధనానికి కొదువ ఉండడు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తేగాని పనులు పూర్తికావు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన తొందరపాటుతనంతో జార విడుచుకుంటారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!