NTV Telugu Site icon

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం ఇంటి కోసం రూ.45 కోట్లు ఖర్చు!

Kejriwal House

Kejriwal House

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఈ మాట అన్నది మరెవరో కాదు బీజేపీ నేతలు. ఆమ్, ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. మోడీని ప్రశ్నిస్తున్న విపక్ష నేతలను ఈడీ, సీబీఐ వంది ఏజెన్సీలతో భయపెట్టాలని చూస్తున్నాయని నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన తర్వాత ఆప్ సర్కార్ వర్సెస్ బీజేపీ సర్కార్ అన్నట్లు సీన్ మారింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ విద్యా అర్హతలకు సంబంధించిన అంశంపై కేజ్రీవాల్ బీజేపీని టార్గెట్ చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగా.. తాజాగా బీజేపీ క్రేజీవాల్ ను ఇరుకున పెట్టింది. ఢిల్లీ సీఎం నివాస పునరుద్ధరణ కోసం ఆయన ఖర్చు చేసిన అంశంపై దృష్టి సారించిన బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. తన నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేశారన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ. కేజ్రీవాల్ వంచనకు పాల్పడ్డారని ఆరోపించారు. పునర్నిర్మాణానికి ముందు ముఖ్యమంత్రి ఇంటి శిథిలావస్థకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది.
Also Read: Parkash Singh Badal: పంజాబ్‌ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

ఆప్‌కి నాయకత్వం వహిస్తున్న కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిజాయితీ, సరళతను ప్రోత్సహిస్తానని ఇచ్చిన హామీని మోసం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. కేజ్రీవాల్ నివాసంలో వియత్నాం నుండి ఖరీదైన పాలరాతి అమర్చబడిందన్నారు. ముందుగా తయారు చేసిన చెక్క గోడలు, ఒక్కొక్కటి లక్షల రూపాయల ఖరీదు చేసే కర్టెన్‌ల కూడా తీసుకొచ్చారని తెలిపారు. ఒక్క కర్టెన్‌కే రూ. 7.94 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు ఆడంబరమైన ఇళ్లలో నివసిస్తున్నారని, ప్రజా ఖర్చుతో ఇతర సౌకర్యాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. తన ఇంటిపై కథనాలు రాకుండా మీడియా సంస్థలకు రూ. 20 నుండి 50 కోట్లు ఆఫర్ చేశారని, అయితే వారు అతని ఆఫర్‌ను విస్మరించారని చెప్పారు. తన విద్యార్హతలపై సందేహాలను నివృత్తి చేసుకోమని అప్ అధినేత కేజ్రీవాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరిన విధంగానే తన నివాస పునరుద్ధరణ గురించిన అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలని బీజేపీ నేత పాత్ర డిమాండ్ చేశారు.

Also Read:BJP MP Rajveer singh : బీజేపీ ఎంపీకి దోమలు కుట్టాయని ట్రైన్ ను ఆపేసిన అధికారులు
ఈ ఆరోపణలపై ఆప్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చారు ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్. ‘మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ 3 గంటల పర్యటనకు రూ.80 కోట్లు ఖర్చయ్యాయి. గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు తమ కోసం రూ. 200 కోట్ల విలువైన విమానాలను తీసుకుంటారు. దీనిపై చర్చించే దమ్ము ఏ ఛానెల్‌కు లేదు’ అని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ట్వీట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు 1942లో నిర్మించిన బంగ్లా కేటాయించారు. దాని పైకప్పు మూడుసార్లు పడిపోయింది. ఒకసారి అతని తల్లిదండ్రుల గది పైకప్పు పడిపోయింది. మరోసారి వారు జనతా దర్బార్ నిర్వహించినప్పుడు పైకప్పు ఊడిపోయింది. 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ బంగ్లా పెయింటింగ్/రిపేర్ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ అని ఆమె అన్నారు.
Also Read:KTR: ఆ రెండు రోజులు జాగ్రత్త.. ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ ఆదేశాలు

రాజధాని పరిపాలనలో కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాను ఉద్దేశించి, కక్కర్ మాట్లాడుతూ, “అరవింద్ కేజ్రీవాల్ జీ తన కోసం 45 కోట్ల విలువైన ప్యాలెస్‌ని నిర్మించుకున్నారని సార్ బిజెపి మీడియా చెబుతోంది. మీరు ఈ ప్యాలెస్‌ని తీసుకుని, మీ పేదల ఇంటిని అరవింద్ జీకి ఇవ్వండి, తద్వారా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది” అని వ్యాఖ్యానించారు. వాస్తవ సమస్యల నుంచి ప్రజలను మళ్లించేందుకే ఈ వివాదాన్ని రేకెత్తించారని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ అన్నారు. తనను తాను ఫకీరుగా చెప్పుకునే ప్రధాని రూ. 500 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఇంటిని పునరుద్ధరించేందుకు రూ. 90 కోట్లు వెచ్చించారు.

Show comments