Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండగా.. సాయంత్రం మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని ప్రజలు ప్రైవేట్ వాహనాల కంటే మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. మెట్రో స్టేషన్ల వద్ద జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ స్టేషన్ ముంబై మెట్రో స్టేషన్లను పోలి ఉంటుంది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ముఖ్యమైన రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను అందుబాటులో ఉంచారు. ఈ షార్ట్ లూప్ ట్రిప్పుల వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా రైళ్ల కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులు నడుస్తాయి. ముఖ్యంగా రాయదుర్గం వెళ్లే మెట్రో చాలా రద్దీగా ఉంటుంది. దీంతో అమీర్‌పేట-రాయదుర్గం కారిడార్‌లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి 7 నిమిషాలకు ఒక రైలు నడుస్తుండగా.. ఆ సమయాన్ని తగ్గించారు. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు.
Also Read
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
కాగా, మెట్రో చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఛార్జీలు పెంచాలని మెట్రో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం కోచ్‌ల సంఖ్యను పెంచకుండా, మెట్రో స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించడంలో ఎల్‌ఎంటీ విఫలమైందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండింటికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చే వరకు టికెట్ రేట్లు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. తాజాగా మెట్రో ప్రయాణికులకు షాక్ ఇస్తూ మెట్రో అధికారులు స్మార్ట్ కార్డులు, క్యూఆర్ టిక్కెట్లపై రాయితీని ఎత్తివేశారు. వీకెండ్ సూపర్ సేవర్ కార్డ్‌ల ధర కూడా రూ. 59 నుండి రూ. 99కి పెంపు.. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మౌలిక వసతులు కల్పించడంలో ఎల్ అండ్ టీ విఫలమవడంతో చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే ఎమౌతుందో తెలుసా ?
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!