హర్యానా ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ హస్తం పార్టీ మాత్రం.. రెండు, మూడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది.
I.N.D.I.A Alliance PM Candidate: ఈసారి ఎలాగైనా భారతీయ జనతాపార్టీని అధికారంలోకి రానివ్వకూడదని ప్రతిపక్షాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. దాని కోసమే బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రతిపక్ష కూటమి ఇండియాను ఏర్పాటు చేశారు. ఇందులో 26 పార్టీలు ఉన్నాయి. అయితే ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ను ఓడించాలంటే ఐకమత్యం చాలా అవసరం. అయితే ఈ పార్టీ నేతలు చాలా రోజులు ఘర్షణ పడకుండా ఉండగలరో లేదో అర్థం కావడం లేదు.…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఈ మాట అన్నది మరెవరో కాదు బీజేపీ నేతలు. ఆమ్, ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది.