వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు సమంజసమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి అంశాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై పలు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది కొత్తగా సినిమాలపై ఆంక్షలు విధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రివ్యూ: పుష్ప
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఏపీ ప్రభుత్వం తాజాగా సినిమా టిక్కెట్ల రేట్లపై ఓ నిర్ణయం తీసుకోవడం ఓ వర్గం వారిని సంతోషపరిచింది. ఎందుకంటే పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి కొందరు సామాన్యులను దోచుకుంటున్నారని ప్రభుత్వం భావించి టిక్కెట్ రేట్లపై జీవో తెచ్చింది. ఈ నిర్ణయం సామాన్య ప్రేక్షకుడికి ఊరట కలిగించేదే. కానీ బెనిఫిట్ షో అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించేది. తమ హీరో సినిమాను ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు.
Read Also: ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్ లీక్..!!
అయితే పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు ప్రదర్శించరనేదే ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే ఏపీలో రెగ్యులర్ షో ప్రదర్శించే సమయానికి పక్క రాష్ట్రంలో బెనిఫిట్ షో వల్ల టాక్ ముందే వచ్చేస్తుంది. అప్పుడు అభిమానులకు కిక్ ఎలా వస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో ఫస్ట్ డే ఫస్ట్ షోకు వచ్చే ఫీలింగ్ తమకు రావడం లేదని.. అయినా తమకు ఇష్టం ఉంటే బెనిఫిట్ షోకు ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్తామని.. ఈ విషయంలో తమను నియంత్రించడం సబబుగా లేదని పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.
Read Also: హిందూపురంలో బన్నీ అభిమానుల రచ్చ.. థియేటర్‌పై రాళ్లు
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని సినిమా ప్రదర్శిస్తున్న బాలాజీ థియేటర్‌పై రాళ్లు విసిరారు. వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా టిక్కెట్ల రేట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉన్నా… బెనిఫిట్ షోలను రద్దు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..