సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 23 వరకు, పది రోజుల పాటు *కూలీ* సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు…
Harish Rao : ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని, అసెంబ్లీలో ప్రకటించిన…
ఏపీలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి అంశాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై పలు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది కొత్తగా సినిమాలపై ఆంక్షలు విధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also: రివ్యూ: పుష్ప ఏపీ ప్రభుత్వం తాజాగా…
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. Read Also: దేశవ్యాప్తంగా రెండు…
ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై ఆన్ లైన్లోనే టికెట్ల విక్రయం జరగనుంది. దీనిపై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రోజుకు కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఏపీలో సినిమా టికెట్ బుకింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ…