Apple CEO: ప్రధాని మోడీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆపిల్ యొక్క రెండవ స్టోర్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో యాపిల్ సీఈఓ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విద్య, డెవలపర్ల నుండి తయారీ వరకు వివిధ అంశాలపై చర్చించారు. అభిప్రాయాలను పంచుకున్నారు. దేశమంతటా అభివృద్ధి కోసం యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని సమావేశం అనంతరం యాపిల్ సీఈఓ కుక్ తెలిపారు. భారతదేశ భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందని తాము ఇందులో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రధానితో భేటీకి ముందు యాపిల్ సీఈవో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.
Also Read:Minister Jadish Reddy : కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ
కాగా, టిమ్ కుక్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారతదేశంలో Apple యొక్క మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో తెరిచిన ఆపిల్ స్టోర్ కంటే సాకేత్ స్టోర్ చిన్నది. ముంబైలో ఆపిల్ యొక్క మొట్టమొదటి ఇండియా స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ మాదిరిగానే.. రేపు సాకేత్ యొక్క సెలెక్ట్ సిటీ మాల్లో స్టోర్ ప్రారంభోత్సవంలో టిమ్ కుక్ కస్టమర్లను స్వాగతించనున్నారు.
Also Read
An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU
— Narendra Modi (@narendramodi) April 19, 2023
- Tags
- Apple
- CEO
- Delhi
- Narendra Modi
- tim cook
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!