దేశంలో రైతుల ఆత్మహత్యలు… ఏపీ@3, తెలంగాణ@4
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019తో పోలిస్తే 2020లో దేశవ్యాప్తంగా 18 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో 10,677 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 4,006 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో ఉండటం గమనించాల్సిన విషయం.
Read Also: వాహనదారుల్లో రాని మార్పు
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
2020లో రైతుల ఆత్మహత్యల విషయంలో కర్ణాటక (2,016) రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (563), నాలుగో స్థానంలో తెలంగాణ (466), ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ (735), ఆరోస్థానంలో ఛత్తీస్‌గఢ్ (532) ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2020 ఏడాదిలో మొత్తం 1,53,052 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. వీరిలో రైతులు 7 శాతం (10,677) ఉన్నారు. వీరిలో రైతులు 5,579 మంది, వ్యవసాయ కూలీలు 5,098 మంది ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. మరోవైపు తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు కూడా రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయి. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 466 మంది రైతుల్లో 419 మంది పురుషులు ఉండగా.. 47 మంది మహిళలు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయకూలీల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!