Site icon NTV Telugu

జల జగడం..! తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు

High Court

High Court

కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతుల కూడా ఎంట్రీ ఇచ్చారు.. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకెక్కారు ఏపీ రైతులు.. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు.. నూటికి నూరుశాతం తెలంగాణ విద్యుత్‌ ప్రాజెక్టులు పనిచేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. జూన్‌ 28న తెలంగాణ సర్కార్‌ జారీ చేసిన ఆ జీవోను సస్పెండ్‌చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. విద్యుత్‌ఉత్పత్తి పేరిట నీటిని విడుదలచేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టంవాటిల్లుతోందన్నారు.. దీనివల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని పేర్కొన్నారు కృష్ణా జిల్లా రైతులు.

Exit mobile version