రేపే బద్వేల్ ఉప ఎన్నికల ఫలితం.. కమలనాథుల లెక్క ఇది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.. మరికొన్ని గంటల్లో ఫలితం కూడా వెలువడనుంది.. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు దూరంగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థులను పోటీకి పెట్టాయి.. ఇక, బీజేపీ అభ్యర్థిని టీడీపీ, జనసేన సహకరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఏకంగా కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్చల్ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ రిస్థితి ఏంటి అనేది దానిపై కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు.
Read Also: నా చర్మంతో చెప్పులు కుట్టించినా సీఎం జగన్ రుణం తీర్చుకోలేను..!
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
బద్వేల్లో గతానికంటే మెరుగైన ఓట్లు.. ఓట్ల శాతం తమకు పెరుగుతాయని బీజేపీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి.. 28 పోలింగ్ స్టేషన్లలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ.. లేకుంటే మరిన్ని ఓట్లు పెరిగేవి అని అంచనాలు కడుతున్నారు. ఇక, తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడిందని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది.. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటి నేతలు టీడీపీ కేడర్‌కు టచ్ లోకి వెళ్లడంతో తమకు ఓట్లు పడ్డాయని భావిస్తోంది ఏపీ కమల దళం.. మరి కమలనాథుల అంచనాలు ఏ స్థాయిలో నిజం అవుతాయనేది మాత్రం మంగళవారం మధ్యాహ్నం లోపు తేలిపోనుంది. అయితే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో వచ్చిన ఈ ఎన్నికల్లో.. ఆయన భార్యే పోటీ చేయడంతో.. వైసీపీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!