కుర్చీని దొంగిలించాడన్న కారణంతో ఓ యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి చెట్టుకు వేలాడదీశారు. అతని కింద మంటలు పెట్టారు. ఈ దారుణ ఘటన ఆగ్రాలోని ఫిరోజాబాద్‌లో జరిగింది. కొందరు దుండగులు ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి, కుర్చీ దొంగిలించారని ఆరోపిస్తూ దాడి చేసి దుర్భాషలాడారు. ఆ వ్యక్తిని చెట్టుకు కట్టివేసి కింద నిప్పంటించాడు. తాను ఎంత అరుస్తున్నా.. బాధితుడిని విడిచిపెట్టలేదు. పొగ కారణంగా స్పృహతప్పి పడిపోయాడు. అయితే, స్థానికులు గమనించి చెట్టుపై నుంచి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.
Also Read: Bhindi Samosa: భిండీ సమోసా టేస్ట్ చేశారా.. విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్
ఆగ్రాలోని ఫిరోజాబాద్ జిల్లాలోని దిబయాచి గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ అనే వ్యక్తి గురువారం రాత్రి 9.30 గంటలకు గ్రామ పెద్ద విష్ణు దయాళ్ తన ఆరుగురు సహచరులతో కలిసి తన ఇంట్లోకి చొరబడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుర్చీ దొంగిలించారని ఆరోపించడంతో దుండగులు తనను దుర్భాషలాడారని, దాడి చేశారని ముఖేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను హత్య చేయాలనే ఉద్దేశంతో గ్రామానికి దూరంగా ఉన్న ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని బాధితుడు తెలిపాడు. దుండగులు అతని మెడ, చేతులు, కాళ్లను మర్రిచెట్టుకు తాడుతో కట్టేసి కింద నిప్పంటించి పారిపోయారు. బాటసారులు అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. గ్రామ ప్రధాన్‌ను జైలుకు తరలించామని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఫిరోజాబాద్ ఎస్పీ కుమార్ రణవిజయ్ సింగ్ తెలిపారు.