టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ముగిసిన రవితేజ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది.. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ప్రశ్నించారు ఈడీ అధికారులు.. మనీల్యాండరింగ్‌కు సంబంధించిన విషయంలో దర్యాప్తు బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతడిని ఎక్సైజ్ ప్రత్యేక బృందం విచారించడంతో కెల్విన్ పేరు తెరపైకి వచ్చింది.. వీరి ఇద్దరినీ విచారించడంతో.. టాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ వినియోగం బటపడింది. శ్రీనివాస్ ద్వారా నటీనటులకు డ్రగ్స్ సరఫరా అయినట్టు అధికారులు గుర్తించారు.
ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు హీరో రవితేజ.. 11 గంటలకు విచారణ ప్రారంభమైంది.. ఇక, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. అయితే, ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్ స్నేహితుడు జిషాన్ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. రవితేజ ఖాతాలతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్టుగా గుర్తించారని చెబుతున్నారు. అయితే, బ్యాంకు లావాదేవీల చుట్టూ.. విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Tags
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!